రేషన్ బియ్యం బస్తాల తూకంలో భారీ తేడాలు: లబ్ధిదారులకు తప్పని మోసాలు
రిపోర్టర్: అశోక్
స్థలం: Eluru
పౌరసరఫరాల శాఖలో పారదర్శకత తెచ్చామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో రేషన్ బియ్యం బస్తాల తూకంలో భారీ తేడాలు వస్తున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చౌక దుకాణాలకు సరఫరా అయ్యే బియ్యంలో తరుగు పేరుతో కిలోల కొద్దీ మోసం జరుగుతోందని డీలర్లు వాపోతున్నారు. గోదాముల సిబ్బంది, బియ్యం మాఫియా కుమ్మక్కై నిరుపేదలకు అందాల్సిన రేషన్‌కు కోత పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ తూకం మోసాలపై అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.