'స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా..': విజయవాడలో అక్టోబరు 3న పాన్ ఐఐటీ సదస్సు
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయవాడ
ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అక్టోబరు 3న విజయవాడలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రతిష్టాత్మక పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సదస్సును నిర్వహించనుంది. ‘స్వర్ణాంధ్ర నుంచి వికసిత్ భారత్ 2047’ ధ్యేయంగా జరగనున్న ఈ సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ల రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఐఐటీ నిపుణుల సహకారంతో రాష్ట్రంలోని యువతకు, స్టార్టప్‌లకు నూతన మార్గదర్శకత్వం అందించనున్నారు.