రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాలిక: అవయవదానంతో ఆరుగురికి పునర్జన్మ
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ లోని బాలానగర్ ఫ్లైఓవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన పదమూడేళ్ల గుడ రోహిత అవయవదానం ద్వారా ఆరుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించినట్లు పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. కూకట్పల్లి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలిక మరణానంతరం ఆమె తండ్రి నారాయణ రావు తీసుకున్న గొప్ప నిర్ణయం సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.