డబ్లిన్ ఎయిర్పోర్టులో షాకింగ్ ఘటన: కుమార సంగక్కరపై సిబ్బంది వివక్ష
రిపోర్టర్: రాము
స్థలం: డబ్లిన్
డబ్లిన్ విమానాశ్రయంలో ఐర్లాండ్ ఎయిర్లైన్స్ రయాన్ఎయిర్ సిబ్బంది తన పట్ల వివక్షాపూరితంగా వ్యవహరించారని శ్రీలంక మాజీ కెప్టెన్, రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర ఆరోపించారు. తన కుటుంబంతో కలిసి వెళ్తున్న సమయంలో గేట్ సిబ్బంది బెదిరింపు ధోరణితో, దారుణంగా ప్రవర్తించారని ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విమానాశ్రయ సిబ్బంది తీరును ఆయన తప్పుపట్టగా, క్రీడా వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.