కడపలో దారుణం: పోలింగ్ విధుల్ లో ఉన్న విలేకరిపై దుండగుల దాడి

రిపోర్టర్: సురేష్ స్థలం: కడప

కడప నగరంలోని మరియాపురం పోలింగ్ కేంద్రంలో విధుల్ లో ఉన్న న్యూస్టుడే కంట్రిబ్యూటర్ ఆనంద్ పై ముప్ఫై మంది దుండగులు దురుసుగా ప్రవర్తించారని స్థానిక వర్గాలు వెల్లడించాయి. ఓటర్ల గుంపును ఫొటోలు తీస్తున్న సమయంలో ఆయనపై దాడి చేసి బలవంతంగా సెల్ఫోన్ లాక్కుని ఫొటోలు తొలగించారని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారని సమాచారం అందింది. ఈ ఘటనపై జర్నలిస్టులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.