నందవరంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నందవరం

నందవరం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కేజీబీవీ బాలికల వసతి భవనం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎన్టీఆర్ సుజల స్రవంతి నీటి కేంద్రం, స్వర్ణ సచివాలయం, సీసీ రోడ్డు, బోర్వెల్ సౌకర్యాలను ప్రారంభించారు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో రూ.2.50 కోట్లతో 8 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. నందవరంలో మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.