'క్షేత్రస్థాయి భూమే ప్రామాణికం': కలెక్టర్ దివాకర టిఎస్
రిపోర్టర్: సతీష్
స్థలం: ఖమ్మం
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వేలో క్షేత్రస్థాయిలో ఉన్న భూమే ప్రామాణికమని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ స్పష్టం చేశారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం గ్రామంలో బుధవారం జరుగుతున్న డిజిటల్ భూ సర్వే పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి అపోహలకు తావులేకుండా, అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా పారదర్శకంగా కొలతలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.