కుస్తీ పోటీల్లో చరిత్ర సృష్టించిన భారత్: కాజల్, నీలంలకు రజత పతకాలు

రిపోర్టర్: సతీష్ స్థలం: అస్తానా

అస్తానా వేదికగా జరిగిన ప్రపంచ కుస్తీ ఛాంపియన్షిప్లో భారత మహిళా రెజ్లర్లు కాజల్ ధోచక్, నీలం సిరోహి రజత పతకాలు సాధించి చరిత్ర సృష్టించారని క్రీడా వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ రెజ్లర్ అనస్తాసియాతో జరిగిన 76 కేజీల ఫైనల్ పోరులో కాజల్ పోరాడి ఓడిపోగా, 50 కేజీల తుదిపోరులో నీలం సిరోహి జపాన్ ఛాంపియన్ యుయి సుసాకి చేతిలో పరాజయం చవిచూశారని, ఒకే ఎడిషన్లో ఇద్దరు భారత మహిళలు ఫైనల్ చేరడం ఇదే తొలిసారని నిర్వాహకులు తెలిపారు.