హైదరాబాద్లో హైపవర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రేణికుంట్ల ప్రవీణ్
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లో జరిగిన హై పవర్ కమిటీ రివ్యూ మీటింగ్ లో బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్, చైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై అట్రాసిటీ కేసుల విషయమై, వారి సంక్షేమంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. బాధితులకు త్వరలోనే గ్రీన్ ఛానల్ ద్వారా పరిహారం అందిస్తామని సీఎం తెలిపారు.