డక్కిలి మండలంలో ఓట్ల వెల్లువతో హోరెత్తిన స్థానిక పోరు
రిపోర్టర్: kummaragunta masthanaiah
స్థలం: డక్కిలి
తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 33,354 ఓట్లకు గాను 22,992 ఓట్లు నమోదయ్యాయి. 68.98 శాతం పోలింగ్ నమోదు కాగా, 45 బూతుల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. తెలుగుదేశం, వైకాపా, బహుజన సమాజ్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొనడంతో, అభ్యర్థులు మరియు ప్రజలు ఏడో తేదీన వెలువడనున్న ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.