'భార్య మృతిని తట్టుకోలేక...': రెండు రోజుల వ్యవధిలో దంపతుల మృతి

రిపోర్టర్: అశోక్ స్థలం: పార్వతీపురం మన్యం

పార్వతీపురం మన్యం జిల్లా తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి అప్పలస్వామి(79), పార్వతమ్మ(75) దంపతులు రెండు రోజుల వ్యవధిలో మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న పార్వతమ్మ సోమవారం మృతి చెందగా, భార్య మృతిని తట్టుకోలేక తీవ్ర దిగులు చెందిన అప్పలస్వామి బుధవారం ఉదయం ప్రాణాలు విడిచారు. దంపతులు ఇద్దరూ అనతికాలంలోనే మృతి చెందడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది.