వినాయక మండపంలో అశ్లీల నృత్యాలు.. తీవ్ర దుమారం!

రిపోర్టర్: రమేష్ స్థలం: అనకాపల్లి

అనకాపల్లి జిల్లా చీడికాడలో వినాయక మండపం వద్ద యువతులు అభ్యంతరకరంగా మాస్ పాటలకు క్లబ్ డాన్సులు చేయడం కలకలం రేపింది. మార్కాపురం జిల్లా కంభంలోనూ ఇలాంటి ఘటనే పునరావృతం కావడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలను అశ్లీల ప్రదర్శనల వేదికగా మారుస్తున్న నిర్వాహకులు, యువకుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంస్కృతిని మంటగలుపుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.