నీట్ పేపర్ లీక్ నిందితుడికి జైలులో ఆధ్యాత్మిక పుస్తకాలకు అనుమతి
రిపోర్టర్: సునీల్
స్థలం: ఢిల్లీ
నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో తీహార్ జైలులో ఉన్న ధనంజయ్ నివృత్తి లోఖండేకు ఢిల్లీ కోర్టు ఊరటనిచ్చింది. జైలులో హనుమాన్ చాలీసా, మంగళ స్తోత్రం మరియు శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర 'శ్రీమాన్ యోగి' పుస్తకాలను చదువుకోవడానికి ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ గుప్తా అనుమతించారు. మహారాష్ట్ర నుండి పేపర్ లీక్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు లోఖండేపై సీబీఐ తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.