మంథనిలో విద్యార్థినులకు పోక్సో చట్టంపై దిశానిర్దేశం చేసిన జడ్జి అపర్ణ

రిపోర్టర్: Subhan.Manthani స్థలం: మంథని

విద్యార్థులకు బాలల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు వారి భద్రతకు సంబంధించిన అంశాలను తెలియజేయాలనే ఉద్దేశంతో నిర్వహించిన సురక్షిత్ బచ్పన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జెడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంథని సీనియర్ సివిల్ జడ్జి మల్లాడి అపర్ణ విద్యార్థులకు పోక్సో చట్టంపై వివరించారు.