శ్రీశైల దేవస్థానం శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు అధికారిక ఆహ్వానం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: శ్రీశైలం
శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈనెల పదకొండవ తేదీ నుంచి ప్రారంభం కానున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయనను కలిసి ఆలయ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో యం.శ్రీనివాసరావు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆహ్వాన పత్రిక అందజేసినట్లు దేవాలయ వర్గాలు వెల్లడించాయి.