గాజువాకలో ఎన్నికల సమరానికి సై.. శ్రేణులకు కోన తాతారావు పిలుపు
రిపోర్టర్: kadambari suhasini
స్థలం: గాజువాక
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు, జనసైనికులు వార్డు స్థాయిలో సమన్వయం చేసుకోవాలని కోన తాతారావు పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారికే రాబోయే ఎన్నికల్లో సముచిత ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
త్వరలో నియోజకవర్గ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి, బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. వార్డు విభజనపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 11లోపు ఎన్నికల అధికారులకు అందజేయాలని స్థానిక నాయకులకు సూచించారు.