కృత్రిమ మేధ భద్రత కోసం గూగుల్ ఓపెన్ ఏఐ సంచలన నిర్ణయం

రిపోర్టర్: శివ స్థలం: Hyderabad

ప్రముఖ టెక్ దిగ్గజాలు గూగుల్, ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ సంయుక్తంగా కృత్రిమ మేధ భద్రత కోసం ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయని నివేదికలు వెల్లడించాయి. ఈ సంస్థకు తాత్కాలికంగా స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫ్రాంటియర్ ఏఐ అని నామకరణం చేశారని ది ఇన్ఫర్మేషన్ పేర్కొంది. ప్రజా భద్రతకు సంబంధించి ఆయా సంస్థలు ఇచ్చిన హామీలకు ఆచరణాత్మక ప్రమాణాలను రూపొందించడమే దీని ప్రధాన ఉద్దేశం అని నిపుణులు తెలిపారు.