ఢిల్లీలో కలకలం: తిరంగా యాత్రకు అనుమతి లేదంటూ సీజేపీ నేతకు నోటీసులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: న్యూఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన తిరంగా యాత్రకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం బీఎన్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉన్నందున ఎలాంటి నిరసన ప్రదర్శనలు చేపట్టరాదంటూ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.