భక్తిశ్రద్ధలతో కొరటికల్ గణనాథుని సన్నిధిలో అన్నప్రసాద వితరణ

రిపోర్టర్: Raju Reporter స్థలం: ఆత్మకూర్

ఆత్మకూర్ మండలంలోని కొరటికల్ గ్రామంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీ గణనాథుని సన్నిధిలో శుక్రవారం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాగటి యాదగిరి-యాదలక్ష్మి దంపతుల కుటుంబసభ్యుల సహకారంతో భక్తులకు అన్నప్రసాదం అందించారు. ప్రత్యేక పూజల అనంతరం గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు.