లోయలో పడిన కారు ప్రమాదంలో నలుగురు యువకులు గల్లంతు

రిపోర్టర్: సురేష్ స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం పొల్లూరు జలపాతం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కారు లోయలో పడిపోయినట్లు మోతుగూడెం ఎస్ఐ అబ్దుల్ నాసిర్ హుస్సేన్ తెలిపారు. విజయవాడకు చెందిన నలుగురు యువకులు సరదాగా గడిపేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు. అదుపుతప్పి పదిహేను అడుగుల లోయలో పడిన కారులో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను పోలీసులు తాడుల సహాయంతో సురక్షితంగా బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.