ఓటర్ల జాబితా సవరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర హెచ్చరిక

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హులైన పౌరుల ఓట్లను తొలగిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఓటరు జాబితాల ప్రక్షాళన పారదర్శకంగా జరగాలని, ఏ ఒక్క అర్హుడూ తన ఓటు హక్కును కోల్పోకూడదని ఆయన స్పష్టం చేశారు. పేర్ల తొలగింపుపై ముందస్తు సమాచారం ఇవ్వాలని మరియు తగిన అవకాశం కల్పించాలని అధికారులను ఆయన డిమాండ్ చేశారు.