టెక్ మార్కెట్లోకి కొత్త పవర్బ్యాంకులు: ఏపెక్స్ సిరీస్ను విడుదల చేసిన బోట్ సంస్థ

రిపోర్టర్: రమేష్ స్థలం: New Delhi

దేశీయ మార్కెట్లోకి నాలుగు సరికొత్త శక్తివంతమైన పవర్బ్యాంకులను విడుదల చేసినట్లు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్ సంస్థ వెల్లడించింది. ఏపెక్స్ పేరిట తీసుకొచ్చిన ఈ కొత్త సిరీస్లో వివిధ సామర్థ్యాలు కలిగిన డివైజెస్ను అందుబాటులో ఉంచినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. రూ. 1,999 ప్రారంభ ధరతో లభించే ఈ పవర్బ్యాంకులు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాగే అధికారిక వెబ్సైట్తో పాటు రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.