హైదరాబాద్ లో పికో టెక్నాలజీ కార్యాలయం ప్రారంభం: యువతకు ఉపాధి అవకాశాలు
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
గ్లోబల్ వాల్యూ క్రియేషన్ కు అడ్డాగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. హైటెచ్ సిటీలో పికో టెక్నాలజీ ఇండియా నూతన కార్యాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సంస్థ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు మెరుగైన ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు లభిస్తాయని వారు స్పష్టం చేశారు. పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.