బిగ్ బాస్ 10: రెండవ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండవ వారంలోకి అడుగుపెట్టింది. నిన్న సోమవారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ప్రత్యేక టాస్క్ ఆధారంగా కంటెస్టెంట్లను నామినేట్ చేశారు. ఈ వారం నామినేషన్స్ లో షాలిని, త్రిగున్, రోహిత్, ఝాన్సీ, ముకేశ్, రామ్ ప్రసాద్, దేబ్జానీ, సుధీర్, కృష్ణుడు, సృష్టి, వర్షిణిలు నిలిచారు. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి నెలకొంది.