'బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించండి': నంద్యాల పోలీసుల ప్రజా సమస్యల వేదిక

రిపోర్టర్: గోపి స్థలం: Nandyal

నంద్యాల జిల్లాలో నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో మొత్తం 110 ఫిర్యాదులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులపై చట్ట పరిధిలో తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధితులకు పూర్తి సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని సంబందిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.