ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి పరారై పోక్సో నిందితుడు ఆత్మహత్య
రిపోర్టర్: మహేష్
స్థలం: వనపర్తి
చంచల్‌గూడ జైలులో పోక్సో కేసులో రిమాండ్‌లో ఉన్న 22 ఏళ్ల కిషోర్ కుమార్ రెడ్డి వైద్య చికిత్స కోసం ఎర్రగడ్డ ఆస్పత్రికి వెళ్లిన సమయంలో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత తన స్వగ్రామమైన వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల చేరుకుని చెరువు గట్టుపై చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.