పట్టణ ప్రాంతాల్లో బహుళ అంతస్తుల్లో సరికొత్త టిడ్కో ఇళ్ల నిర్మాణం
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదల కోసం ప్రభుత్వం జీ+8 నుంచి జీ+14 అంతస్తుల వరకు సరికొత్త టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఒక్కో ఫ్లాటు 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షల వ్యయంతో వీటిని నిర్మించనున్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేలా లిఫ్ట్ సౌకర్యం, పార్కింగ్, అంగన్వాడీ కేంద్రాలు ఉండేలా ఈ డిజైన్లను రూపొందించగా సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.