పరవాడలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలి: సిఐటియు డిమాండ్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పరవాడ
పరవాడలో ఈఎస్ఐ ఆసుపత్రి కోసం 1.43 ఎకరాల భూమి కేటాయించినా, నిధులు విడుదల చేయకపోవడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులు సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారని సిఐటియు నాయకుడు గనిశెట్టి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
సుమారు 23 వేల మంది కార్మికులు ఈఎస్ఐ బీమా చెల్లిస్తున్నా, కనీస వైద్య సేవలు అందడం లేదని ఆయన విమర్శించారు. వెంటనే బర్న్ వార్డుతో కూడిన ఆసుపత్రిని నిర్మించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ మరియు ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్‌కు వినతిపత్రాలు అందజేశారు.