కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం: ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
దేశంలో రవాణా రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర కేబినెట్ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నట్లు G Kishan Reddy వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటుకు అధికారికంగా ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. ఈ నూతన అథారిటీ ద్వారా దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థల మధ్య సమన్వయం మరింత మెరుగుపడుతుందని, లాజిస్టిక్స్ రంగానికి నూతన ఊతమందుతుందని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్నట్లు తెలిపారు.