షాకింగ్ ఘటన: ఢిల్లీలో వేగంగా దూసుకొచ్చిన ఎస్యూవీ బీభత్సం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Delhi

ఢిల్లీలోని షాలిమార్ బాగ్ ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన ఒక ఎస్యూవీ వాహనం నిలిపి ఉంచిన నాలుగు ఆటోలను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాద ధాటికి ఆటోలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తి విచారణ జరుపుతున్నామని స్థానిక పోలీసులు స్పష్టం చేశారు.