రైతు బజార్లలో కిలో ముప్ఫై ఐదు రూపాయలకే ఉల్లిపాయల విక్రయం

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

నిత్యావసర సరుకుల ధరల భారాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. బుధవారం నుంచి రాష్ట్రంలోని రైతు బజార్లలో కేజీ రూ. 35 వంతున సబ్సిడీ ధరకు నాణ్యమైన ఉల్లిపాయలను విక్రయించనున్నట్లు వారు తెలిపారు. మొదటి విడతలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ విక్రయాలు ప్రారంభమవుతాయని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఆధార్ లేదా రేషన్ కార్డు ప్రాతిపదికన నెలకు రెండు కేజీల చొప్పున సబ్సిడీ ఉల్లిని అందించనున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు.