దిల్లీలో విద్యార్థుల కోసం పదివేల హాస్టల్ సీట్లు నిర్మాణం

రిపోర్టర్: సునీల్ స్థలం: న్యూఢిల్లీ

దిల్లీలో సత్య నికేతన్ భవన దుర్ఘటన నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సీఎం రేఖా గుప్తా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధానిలో చదువుకునే విద్యార్థుల కోసం దిల్లీ ప్రభుత్వం 10,000 హాస్టల్ గదులను నిర్మించనున్నట్లు ప్రకటించారు. పీజీలు, అసురక్షిత వసతి గృహాల్లో ఉండలేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు, అమ్మాయిలకు ఈ హాస్టల్స్ సురక్షితమైన, చౌకైన వసతిని అందిస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.