డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక
రిపోర్టర్: మహేష్
స్థలం: అనకాపల్లి
డ్రగ్స్ రహిత సమాజం కోసం అవగాహనతో పాటు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని మంత్రి అనిత స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు గంజాయి సాగు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కృషి చేస్తున్నామని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనుమానాస్పద కార్యకలాపాలపై మౌనం వీడి 1972 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.