జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో పూర్తి స్థాయి నీటిమట్టానికి సమీపంలోకి

రిపోర్టర్: సురేష్ స్థలం: జోగులాంబ గద్వాల

జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 6 గంటల సమయానికి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి సమీపంలోకి చేరింది. ప్రస్తుత నీటిమట్టం 318.17 మీటర్లు కాగా, ఎఫ్‌ఆర్‌ఎల్‌ 318.516 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టులోకి 1,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 8.949 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇది గరిష్ఠ నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలలో 92.66 శాతంగా ఉంది. ప్రస్తుతానికి ఔట్‌ఫ్లో లేనప్పటికీ, నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో అధికారుల పర్యవేక్షణ కొనసాగుతోంది.