పదిహేడేళ్ల సర్వీస్లో ఇరవై ఆరుసార్లు బదిలీలు, సస్పెన్షన్లు ఎదుర్కొన్న నిజాయితీ అధికారి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఫిరోజ్‌పూర్

పంజాబ్లో కల్తీకి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటున్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అభినవ్ కుమార్పై ప్రభుత్వం తాజాగా సస్పెన్షన్ వేటు వేసింది. పదిహేడేళ్ల తన సుదీర్ఘ సర్వీస్లో ఆయన ఏకంగా ఇరవై ఆరుసార్లు సస్పెన్షన్లు, బదిలీలను ఎదుర్కొన్నట్లు జాతీయ మీడియాతో అభినవ్ కుమార్ తెలిపారు. నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకపోవడం వల్లే తనపై కక్షసాధింపు చర్యలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేయగా, ఆయనకు మద్దతుగా ఫిరోజ్పూర్లో వందలాది మంది ప్రజలు రోడ్డెక్కి తీవ్ర నిరసనలు చేపట్టారు.