హైదరాబాద్లో క్రికెట్ సందడి: ఉప్పల్ స్టేడియంలో నేడు భారత్ వెస్టిండీస్ మ్యాచ్

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం రాత్రి నాలుగో టీ20 మ్యాచ్ జరగనుందని పోలీసులు తెలిపారు. ఈ మ్యాచ్కు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మ్యాచ్ జరిగే సమయాల్లో పలు మార్గాల్లో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించామని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పోలీసులు సూచించారు.