సెంట్రలైజ్డ్ కిచెన్ భోజన సరఫరాలో వివక్షను ఖండించిన నీరటి రామ్ ప్రసాద్

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా విద్యార్థులకు భోజనం పెట్టడంలో వివక్ష చూపకూడదని నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రామ్ ప్రసాద్ అన్నారు. జన్నారం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి ఆయన నిరసన తెలిపారు. ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు అల్పాహారం అందించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ తక్షణమే మధ్యాహ్న భోజనం అందించాలని డిమాండ్ చేశారు.