నగర విద్యార్థుల్లో అవగాహన: పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన విశాఖ పోలీసులు
రిపోర్టర్: రాము
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం నగరంలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు Vizag Police వెల్లడించారు. నగరంలోని విద్యార్థులకు భద్రతా చర్యలు, చట్టాలపై అవగాహన కల్పించే దిశగా ఈ కార్యక్రమాలను స్థానిక పోలీసులు విజయవంతంగా కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ సమావేశాల ద్వారా విద్యార్థుల్లో నేరాల పట్ల అప్రమత్తత పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.