విశాఖలో కలకలం: ఐఎన్ఎస్ డేగా వద్ద కానిస్టేబుల్ తుపాకీ మిస్‌ఫైర్
రిపోర్టర్: సురేష్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగా వద్ద కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ భద్రతా విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీ మిస్‌ఫైర్ కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ అప్పలకొండ ఎడమవైపు ఛాతి కింద తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద శబ్దం రావడంతో వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది, అపస్మారక స్థితిలో ఉన్న క్షతగాత్రుడిని తక్షణమే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు.