పెళ్లి పేరుతో దారుణ మోసం: నటి షమ్నా కాసిమ్ సంచలన వెల్లడి

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

పెళ్లి పేరుతో తనను మోసం చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి ఒకే కుటుంబానికి చెందిన పలువురు వ్యక్తులు ప్రయత్నించారని నటి షమ్నా కాసిమ్ ఆవేదన వ్యక్తం చేశారు. వనితా మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఆ ఘటన తనను ఎంతగానో కలచివేసిందని, మీడియాలో తన పేరు చూసినప్పుడల్లా భయపడేదానని తెలిపారు. నకిలీ పేర్లతో అమాయక కుటుంబాలను మోసం చేసే ముఠాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు.