సెప్టెంబర్ 12 నుంచి ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ప్రారంభం

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్‌లో 69 అడుగుల ఎత్తుతో పంచముఖ సంకటహర మహాగణపతి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. భక్తుల సౌలభ్యం కోసం సెప్టెంబర్ 12 నుంచే స్వామివారి దర్శనం ప్రారంభంకానుంది. సోమనాథ జ్యోతిర్లింగం, కాళీమాత ప్రత్యేక నమూనాలతో పాటు పూర్తిగా పర్యావరణ హితంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా ఆగమన కార్యక్రమం నిర్వహించనున్నారు.