విశాఖలో హెచ్ పీ సీ ఎల్ రిఫైనరీలో పేలుడు: ఎగసిపడిన భారీ మంటలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం సింధియా ప్రాంతంలోని హెచ్పీసీఎల్ రిఫైనరీలో సోమవారం రాత్రి భారీ పేలుడు సంభవించిందని మల్కాపురం సీఐ ఇ.నరసింహరావు వెల్లడించారు. సల్ఫర్ ట్యాంకుల అడుగు భాగాన ఉండే వ్యర్థ చమురు ట్యాంక్ పేలడంతో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయని, నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసిందని తెలిపారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారని, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు.