తమిళనాడు ఉపఎన్నికల్లో పోటీ చేయనున్న సీపీఐ, సీపీఎం పార్టీలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: తమిళనాడు
తమిళనాడులో అక్టోబర్ 6న జరగనున్న మధురాంతకం, ధరాపురం ఉపఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. బీజేపీని అడ్డుకోవడానికి టీవీకే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు కొనసాగిస్తామని, అయితే ఎన్నికల్లో స్వతంత్రంగా బరిలోకి దిగుతామని ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు పి.షణ్ముగం, ఎం.వీరపాండియన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై ఎన్నికల్లో పోరాడుతామని వెల్లడించారు.