దేశవ్యాప్తంగా ఘనంగా ఆయుష్మాన్ భారత్ ఎనిమిదేళ్లు పూర్తి

రిపోర్టర్: గోపి స్థలం: India

దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్ఠాత్మక ఆయుష్మాన్ భారత్ పథకం విజయవంతంగా ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథాకంగా నిలిచిన ఈ యోజన ద్వారా సుమారు 60 కోట్ల మంది లబ్ధిదారులు ఏడాదికి రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా రక్షణ పొందుతున్నారని వెల్లడించారు.