అన్నదాతల ఆక్రోశం: ఆమనగల్లు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించిన ప్రభుత్వం

రిపోర్టర్: హరి స్థలం: రంగారెడ్డి

ఆమనగల్లు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుండి శనివారం వరకు రైతులు అందుబాటులో ఉండి వ్యవసాయ అధికారులకు సహకరించాలని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గౌడ్ కోరారు. గ్రామాల్ లో అధికారులు పంట పొలాలను పరిశీలించి ఎండిపోయిన పంటల వివరాలు సేకరిస్తారని ఆయన స్పష్టం చేశారు. మిగతా వివరాల కోసం రైతులు క్లస్టర్ ఏఈఓలను సంప్రదించాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు.