కోటి ఇళ్లకు చేరిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం: నారా లోకేశ్

రిపోర్టర్: అశోక్ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన 'ఇంటింటికీ తెలుగుదేశం-2026' కార్యక్రమం కోటి ఇళ్లకు చేరుకుని చారిత్రక మైలురాయిని అధిగమించింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, వారి సమస్యలను పరిష్కరించడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించారని మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. ఈ విజయం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి కార్యకర్తకు దక్కుతుందని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.