దిగువ మొదలపల్లిలో ఇంటింటికీ తిరిగి జోరుగా ఎంపీటీసీ అభ్యర్థి ప్రచారం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: తవణంపల్లె

తవణంపల్లి మండల పరిధిలోని దిగువ మొదలపల్లి పంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థి సద్దాం ఎన్నికల ప్రచారం గ్రామాల్లో జోరుగా సాగుతోంది. ఇంటింటికీ తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ, తనకు ఒక్క అవకాశం ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.