విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్

రిపోర్టర్: నరేష్ స్థలం: బెంగళూరు

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై సౌతాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాకర్ గుప్తా పాడ్కాట్లో మాట్లాడిన ఆయన, తాను తొలిసారి కోహ్లీని కలిసినప్పుడు అతడు ఎంతో గర్వంగా, అతిగా ప్రవర్తించేవాడనిపించిందని వెల్లడించారు. అయితే అది గర్వం కాదని, అప్పట్లో కోహ్లీలో ఉన్న అత్యున్నత ఆత్మవిశ్వాసమే ఆ విధంగా కనిపించేలా చేసిందని డివిలియర్స్ స్పష్టం చేశారు.