గుంటూరు జిల్లాలో కన్నతల్లిని అత్యంత దారుణంగా హతమార్చిన కూతురు

రిపోర్టర్: వెంకట్ స్థలం: గుంటూరు

గుంటూరు జిల్లా పొన్నూరులో ప్రేమ వ్యవహారానికి అడ్డువస్తోందన్న కోపంతో కన్నతల్లినే కూతురు ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. కేబిన్ పేటకు చెందిన ఈపూరు లక్ష్మిని ఆమె కూతురు పుష్పలత, ప్రియుడు రాజా పక్కా పథకం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత కడతేర్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.