కలిగిరిలో ఘనంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలను కలిగిరి మండలంలోని రావులకల్లు పంచాయతీ ఎస్సీ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పేదలకు నిత్యావసర సరుకులు, దుస్తులను పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు.